ఎస్టీల జీవన స్థితిగతుల పరిశీలన

ABN , First Publish Date - 2022-10-02T04:57:19+05:30 IST

ఐటీడీఏ పీవో డాక్టర్‌ మందా రాణి శనివారం రూరల్‌ మండల పరిసర ప్రాంతాల్లో పలువురు యానాదుల జీవన స్థితిగతులను పరిశీలించారు.

ఎస్టీల జీవన స్థితిగతుల పరిశీలన
చల్లా యానాదులతో మాట్లాడుతున్న పీవో డాక్టర్‌ మందా రాణి

  ప్రభుత్వానికి నివేదిక పంపనున్న ఐటీడీఏ పీవో

నెల్లూరు ( వీఆర్సీ ) అక్టోబరు 1 : ఐటీడీఏ పీవో డాక్టర్‌ మందా రాణి శనివారం రూరల్‌ మండల పరిసర ప్రాంతాల్లో పలువురు యానాదుల జీవన స్థితిగతులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలోని చల్లా యానాదుల జీవన స్థితిగతులపై  ప్రభుత్వానికి నివేదికను పంపనున్నారు. యానాదులు దుర్భర జీవితాన్ని  గడుపుతున్నారని, వారి జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు తగిన చర్యలు తీసుకునేలా ఉన్నతాధికారులకు తెలుపుతామన్నారు. తాను సందర్శించిన కాలనీల్లో దివ్యాంగులను గుర్తించి వారికి సదరం సర్టిఫికెట్స్‌, పలువురికి ఆధార్‌ కార్డులు కార్డులను అందించేందుకు చర్యలు తీసుకున్నామని తెలిపారు. బడికి వెళ్లకుండా ఉంటున్న వారికోసం కాలనీలలోనే నాన్‌ రెసిడెన్షియల్‌ పాఠశా లలను సర్వశిక్ష సహకారంతో  ఏర్పాటు చేస్తామన్నారు. కాలనీల్లో మౌలిక వసతులు, రేషన్‌ కార్డులలపై కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్తామన్నారు. సచివాలయ వలంటీర్లు స్థానిక సమస్యలను గుర్తించి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు వెళ్లాలని సూచించారు. పీవో వెంట ఏఎంవో శాంతకుమారి, సీఎంవో మణికంఠ జీసీడీవో శాంతి, వెల్ఫేర్‌ అసిస్టెంట్‌ మధుబాబు తదితరులు పాల్గొన్నారు.

Read more