వీఎ్‌సయూ అభివృద్ధికి కృషి

ABN , First Publish Date - 2022-09-27T04:20:09+05:30 IST

విక్రమ సింహపురి యూనివర్శిటీ అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి తెలిపారు.

వీఎ్‌సయూ అభివృద్ధికి కృషి
వ్యాయమశాల శిలాఫలకాన్ని ఆవిష్కరించి మంత్రి కాకాణి, వీసీ సుందరవల్లి

మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి

వెంకటాచలం, సెప్టెంబరు 26 : విక్రమ సింహపురి యూనివర్శిటీ అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి తెలిపారు. మండలంలోని కాకుటూరు వద్ద ఉన్న యూనివర్శిటీలో సోమవారం యువతీ, యువకులకు సంబంధించి వేర్వేరుగా ఏర్పాటు చేసిన వ్యాయామ శాలలను వర్శిటీ వీసీ సుందరవల్లితో కలిసి ఆయన ప్రారంభించారు. 

ఎన్‌ఎ్‌సఎ్‌స వలంటీర్లకు అభినందన

విక్రమ సింహపురి యూనివర్శిటీ ఎన్‌ఎ్‌సఎ్‌స వలంటీర్లను వీసీ సుందరవల్లితో కలిసి మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి యూనివర్సిటీలో అభినందించారు. జాతీయ, రాష్ట్రస్థాయి అవార్డులను అందుకున్న ఎన్‌ఎ్‌సఎ్‌స వలంటీర్లు చుక్కల పార్థసారధి (కృష్ణచైతన్య డిగ్రీ కళాశాల), డి సాత్విక (జగన్స్‌ డిగ్రీ కళాశాల), పీ వెంకట చైతన్య (కృష్ణ చైతన్య డిగ్రీ కళాశాల)ను అభినందిస్తూ జిల్లా పేరు జాతీయ స్థాయిలో నిలబెట్టడం గర్వకారణమని పేర్కొన్నారు. కార్యక్రమంలో వర్శిటీ రిజిస్ర్టార్‌ డాక్టర్‌ పీ రామచంద్రారెడ్డి, కళాశాల ప్రిన్సిపాల్‌ విజయనంద్‌ కుమార్‌ బాబు, ఎన్‌ఎ్‌సఎ్‌స సమన్వయకర్త డాక్టర్‌ అల్లం ఉదయ్‌ శంకర్‌  తదితరులు పాల్గొన్నారు. అనంతరం యూనివర్శిటీలో పంచాయతీ రాజ్‌ వ్యవస్థలో మార్పులు, పరిణామాలపై పీహెచ్‌డీ చేస్తున్న మంత్రి కాకాణి తన పరిశోధనకు సంబంధించి పంచాయతీ రాజ్‌ వ్యవస్థ ప్రాధాన్యతను, పనితీరుకు సంబంధించిన అనేక అంశాలను యూనివర్శిటీ ప్రొఫెసర్ల సమక్షంలో వివరించారు.

చేయూత చెక్కు అందజేత

మండలంలోని చవటపాళెం పంచాయతీ ఎర్రగుంట వద్ద ఉన్న కమ్యూనిటీ హాలో మనుబోలు, వెంకటాచలం మండలాలకు సంబంధించి వైఎ్‌సఆర్‌ చేయూత పథకం కింద 3వ విడత ఆర్థిక సాయాన్ని 6355 మంది లబ్ధిదారులకు సూమారు రూ.12 కోట్ల చెక్కును మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి అందజేశారు. అనంతరం మహిళలు ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శించారు. కార్యక్రమంలో ఎంపీడీవోలు సుస్మితరెడ్డి, వెంకటేశ్వర్లు, తహసీల్దార్‌ నాగరాజు, డీఆర్‌డీఏ ఏరియా కోఆర్డీనేటర్‌ శ్రీనివాసులు, వెలుగు ఏపీఎం వనజాక్షి, నాయకులు వెంకటశేషయ్య, కోదండరామిరెడ్డి, రఘనందన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Read more