వీఎస్‌యూలో స్పోర్ట్స్‌ బోర్డు సమావేశం

ABN , First Publish Date - 2022-10-12T04:50:12+05:30 IST

మండలంలోని కాకుటూరు వద్ద ఉన్న విక్రమ సింహపురి యూనివర్సిటీ ( వీఎస్‌యూ )లో మంగళవారం వర్సిటీ వీసీ సుందరవల్లి అధ్యక్షతన స్పోర్ట్స్‌ బోర్డు సమావేశం జరిగింది.

వీఎస్‌యూలో స్పోర్ట్స్‌ బోర్డు సమావేశం

వెంకటాచలం, అక్టోబరు 11 : మండలంలోని కాకుటూరు వద్ద ఉన్న విక్రమ సింహపురి యూనివర్సిటీ ( వీఎస్‌యూ )లో మంగళవారం వర్సిటీ వీసీ సుందరవల్లి అధ్యక్షతన స్పోర్ట్స్‌ బోర్డు సమావేశం జరిగింది. వీఎస్‌యూలో సింథటిక్‌ బాస్కెట్‌ బాల్‌ కోర్టు, క్రికెట్‌ గ్రౌండ్‌ ఆధునికీకరించి అంతర్‌ కళాశాలల పోటీలకు సిద్ధం చేసేందుకు నిధులు మంజూరు చేశారు. కార్యక్రమంలో వర్సిటీ రిజిస్ర్టార్‌ డాక్టర్‌ పీ రామచంద్రారెడ్డి, విజయానందకుమార్‌ బాబు, సీహెచ్‌ శ్రీనివాసరావు, జాన్సన్‌, శివశంకర్‌రెడ్డి, సీపీ లక్ష్మీప్రసన్న, మధుసూదన వర్మ, రవీంద్రబాబు, సీ విజయ, పీ నారాయణరాజు, పీ ప్రసాద్‌రెడ్డి, డాక్టర్‌ కే సునీత పాల్గొన్నారు.

Read more