స్పందన అర్జీలు పరిష్కరించకుంటే కఠిన చర్యలు

ABN , First Publish Date - 2022-11-07T23:32:55+05:30 IST

స్పందన కార్యక్రమంలో వచ్చిన అర్జీలను పరిష్కరించకుండా మరుగున పడేస్తే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ చక్రధర్‌బాబు హెచ్చరించారు.

స్పందన అర్జీలు పరిష్కరించకుంటే కఠిన చర్యలు
అర్జీలు స్వీకరిస్తున్న కలెక్టర్‌ చక్రధర్‌బాబు

నెల్లూరు(హరనాథపురం), నవంబరు 7 : స్పందన కార్యక్రమంలో వచ్చిన అర్జీలను పరిష్కరించకుండా మరుగున పడేస్తే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ చక్రధర్‌బాబు హెచ్చరించారు. సోమవారం కలెక్టరేట్‌లోని తిక్కన భవన్‌లో జరిగిన స్పందన కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రజల నుంచి స్వయంగా అర్జీలు స్వీకరించారు. సంబంధిత అధికారులను పిలిచి ఆ అర్జీలను పరిశీలించి వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. స్పందనకు జిల్లా నలుమూలల నుంచి వచ్చే ప్రజల నుంచి స్వీకరించే అర్జీలను మొక్కుబడిగా కాకుండా అర్జీదారులు సంతృప్తి చెందేలా పరిష్కార మార్గం చూపాలన్నారు. ఆయా దరఖాస్తులు మళ్లీ పునరావృతం కాకుండా నిర్థిష్ట గడువులోగా పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జేసీ కూర్మనాథ్‌, ట్రైనీ కలెక్టర్‌ విద్యాధరి, డీఆర్‌వో వెంకటనారాయణమ్మ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-07T23:32:55+05:30 IST

Read more