వేదగిరిపై విశేష పూజలు

ABN , First Publish Date - 2022-06-12T04:55:25+05:30 IST

వేదగిరి క్షేత్రంలో లక్ష్మీనరసింహస్వామి సన్నిధిన శనివారం విశేష పూజలు నిర్వహించారు.

వేదగిరిపై విశేష పూజలు
స్వామి సన్నిధిలో తిరుప్పావడ సేవ

నెల్లూరురూరల్‌, జూన్‌ 11 : వేదగిరి క్షేత్రంలో లక్ష్మీనరసింహస్వామి సన్నిధిన శనివారం విశేష పూజలు నిర్వహించారు. స్వామి జన్మనక్షత్రం కావడంతో ఆలయంలో అమ్మ, స్వామి వార్లకు పంచామృత అభిషేకాలు, తిరుప్పావడ సేవ చేశారు. అనంతరం కల్యాణ మందిరంలో వివాహ మహోత్సవ వేడుకలు నిర్వహించారు. అనంతరం విశేష అలంకరణలతో స్వామిని ముస్తాబు చేశారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్‌ వేమిరెడ్డి సురేంద్రరెడ్డి, ఈవో గిరికృష్ణ, ఆలయ ప్రధాన అర్చకులు భాస్కరాచార్యులు పాల్గొన్నారు.

Read more