-
-
Home » Andhra Pradesh » Nellore » Seenaih adugujadallo payaniddam-MRGS-AndhraPradesh
-
శీనయ్య అడుగుజాడల్లో పయనిద్దాం
ABN , First Publish Date - 2022-02-24T03:45:04+05:30 IST
మాజీ మంత్రి నల్లపరెడ్డి శ్రీనివాసులు అడుగుజాడల్లో పయనిద్దామంటూ వివిధ పార్టీల నాయకులు, ప్రజాసంఘాల ప్రతినిధులు ప్రతిజ్ఞ చేశారు.

కోట, ఫిబ్రవరి 23: మాజీ మంత్రి నల్లపరెడ్డి శ్రీనివాసులు అడుగుజాడల్లో పయనిద్దామంటూ వివిధ పార్టీల నాయకులు, ప్రజాసంఘాల ప్రతినిధులు ప్రతిజ్ఞ చేశారు. నల్లపరెడ్డి శ్రీనివాసులురెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం కోట బజారు సెంటర్‌లోని శ్రీనివాసులురెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నల్లపరెడ్డి రహన్‌రెడ్డి ఆధ్వర్యంలో ఎంపీటీసీ మోబీన్‌బాషా, సర్పంచు వెంకటరమణమ్మ ఆధ్వర్యంలో ప్రతిజ్ఞ చేశారు.