సంగం ఆనకట్టకు 42వేల క్యూసెక్కుల నీటి ప్రవాహం

ABN , First Publish Date - 2022-10-03T05:04:07+05:30 IST

సంగం ఆనకట్టకు సోమశిల జలాశయం నుంచి ఆదివారం సుమారు 42 వేల క్యూసెక్కుల నీటి ప్రవాహం ప్రవహిస్తుంది.

సంగం ఆనకట్టకు 42వేల క్యూసెక్కుల నీటి ప్రవాహం
ఆనకట్ట వారధిపై ప్రవహిస్తున్న సోమశిల వరద జలాలు


సంగం, అక్టోబరు 2: సంగం ఆనకట్టకు సోమశిల జలాశయం నుంచి ఆదివారం సుమారు 42 వేల క్యూసెక్కుల నీటి ప్రవాహం ప్రవహిస్తుంది. దీంతో ఆనకట్ట వద్ద నీటిమట్టం 11.2 అడుగులు నమోదైంది. ఈ ప్రవాహం వారధిపై నుంచి దిగువ నెల్లూరు ఆనకట్టకు వెళ్తున్నాయి. ఆనకట్ట వద్ద ప్రమాదాలు జరగకుండా ఇరిగేషన్‌ అధికారులు వారధి గేట్లకు తాళం వేసి పర్యవేక్షిస్తున్నారు. ఆనకట్ట ఉత్తర, దక్షిణం వైపు వాహన రాకపోకలు నిలిపివేశారు. దీంతో వాహనదారులు, పిల్లలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.Read more