సమస్యల పరిష్కారానికే గడప గడపకు..

ABN , First Publish Date - 2022-10-02T04:06:48+05:30 IST

ప్రజా సమస్యలను పరిష్కరించడం కోసమే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమ ఉద్దేఽశమని ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డి తె

సమస్యల పరిష్కారానికే గడప గడపకు..
ప్రజల నుంచి సమస్యలు తెలుసుకుంటున్న ఎమ్మెల్యే విక్రమ్‌రెడ్డి

సంగం, అక్టోబరు 1: ప్రజా సమస్యలను పరిష్కరించడం కోసమే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమ ఉద్దేఽశమని ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డి తెలిపారు. శనివారం ఆయన మండలంలోని వంగల్లులో రెండోరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. వంగల్లు వడ్డిపాళెం, ఎస్టీ, ఎస్సీ కాలనీల్లో ఇంటింటికి వెళ్లి, సమస్యలు అడిగి తెలుసుకున్నారు.  అనంతరం మండల అధికారులతో సమావేశమై  సమస్యలపై  చర్చించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో గోపి, తహసీల్దారు జయవర్థన్‌, వైసీపీ  నాయకులు శంకర్‌రెడ్డి, రఘునాథ్‌రెడ్డి,  శేఖరయ్య, సర్పంచులు రామయ్య, సునీల్‌, ఆనం ప్రసాద్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 


వాశిలిలో పర్యటన


ఆత్మకూరు :  మండలంలోని వాశిలిలోలో శనివారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డి, మండలాధ్యక్షుడు కేతా వేణుగోపాల్‌రోడ్డి, అధికారులు పాల్గొని ప్రజలను అడిగి సమస్యలను తెలుసుకున్నారు.   ఈ కార్యక్రమంలో వైసీపీ మండల కన్వీనర్‌ చిట్టమూరు జితేంద్రనాగ్‌, పలువురు ప్రజాప్రతినిధులు, సచివాలయ సిబ్బంది, వలంటీర్లు, తదితరులు పాల్గొన్నారు.

----------


Read more