-
-
Home » Andhra Pradesh » Nellore » samasya pariskaraniki krushi-MRGS-AndhraPradesh
-
సమస్యల పరిష్కారానికి కృషి : ఎంపీపీ
ABN , First Publish Date - 2022-10-07T03:38:22+05:30 IST
ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎంపీపీ ఆలూరి కొండమ్మ పేర్కొన్నారు. పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయంలో గురువారం

రసాభాసగా మండల సమావేశం
కావలి రూరల్, అక్టోబరు6: ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎంపీపీ ఆలూరి కొండమ్మ పేర్కొన్నారు. పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయంలో గురువారం ఎంపీపీ అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం జరగ్గా, రసాభాసగా సాగింది. ఉదయం 9 గంటలకు జరగాల్సిన సమావేశం 11 గంటలకు జరిగింది. ఆర్అండ్బీ ఏఈ భరత్క్రిష్ణ తమ శాఖ గురించి వివరించబోగా, జడ్పీటీసీ సభ్యుడు జంపాని రాఘవులు కలుగజేసుకుని ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్ రెడ్డి ఎంతో సౌమ్యుడని, ఆర్అండ్బీ అధికారులు ఆయన్ను అప్రదిష్టపాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. రోడ్డు నిర్మాణం చేపట్టాల్సిన ఆర్అండ్బీ ఎస్సీ, డీఈలు ఏమిచేస్తున్నారని ప్రశ్నించారు. తుమ్మలపెంట రోడ్డు దుస్థితిపై టీడీపీ నేతలు నిత్యం రాద్ధాంతం చేస్తున్నారని, గత ప్రభుత్వంలో వారు ఏమి చేస్తున్నారో చెప్పాలన్నారు. సర్పంచులు, ఎమ్పీటీసీలకు సమయపాలన లేనందునే సమావేశం ఆలస్యంగా జరిగిందన్నారు. సమావేశానికి అన్నీశాఖల అధికారులు మాత్రం తప్పనిసరిగా హాజరుకావాలన్నారు. ఈ కార్యక్రమం లో ఎమ్పీడీవో సుబ్బారావు, వైస్ ఎంపీపీలు అరగల కవిత, పామంజి రాజయ్య, సర్పంచులు, ఎమ్పీటీసీలు, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.