సమన్వయంతో పని చేస్తేనే ఫలితం

ABN , First Publish Date - 2022-09-27T03:00:28+05:30 IST

మండల టీడీపీ కన్వీనర్లు, క్లస్టర్‌ ఇన్‌చార్జిలు సమన్వయంతో పని చేస్తేనే మంచి ఫలితాలు వస్తాయని టీడీపీ జాతీయ ప్రధాన కా

సమన్వయంతో పని చేస్తేనే ఫలితం
సమావేశంలో మాట్లాడుతున్న బీద రవిచంద్ర

  -బీద రవిచంద్ర 

ఉదయగిరి రూరల్‌, సెప్టెంబరు 26: మండల టీడీపీ కన్వీనర్లు, క్లస్టర్‌ ఇన్‌చార్జిలు సమన్వయంతో పని చేస్తేనే మంచి ఫలితాలు వస్తాయని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర పేర్కొన్నారు. సోమవారం స్థానిక చెంచురామయ్య అతిథిగృహంలో మండల టీడీపీ కన్వీనర్‌ బయ్యన్న అధ్యక్షతన సీతారామపురం, ఉదయగిరి మండల నాయకులతో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడతూ ఓడిపోతామనే భ్రమతో ప్రతి కార్యకర్త కష్టపడి పని చేస్తేనే ఫలితం ఉంటుందన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి ఓటర్ల జాబితాలో చేర్పులు, మార్పులు జరుగుతున్నాయన్నారు. ఉదయగిరి, సీతారామపురం మండలాల్లో సభ్యత్వాల నమోదు, ఓటర్ల జాబితాలు పరిశీలించడంలో సమన్వయలోపం కనిపిస్తుందన్నారు. ఎన్నికలకు ఏడాదిన్నర సమయం ఉందని, ప్రతినెలా 9వ తేదీన మండల పార్టీ సమావేశం నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు బొల్లినేని వెంకటరామారావు, కంభం విజయరామిరెడ్డి,  నాయకులు పొన్నెబోయిన చెంచలబాబుయాదవ్‌, మతకాల శ్రీనివాసులయాదవ్‌, రియాజ్‌, బొజ్జా నరసింహులు, నల్లిపోగు రాజా, వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు. 


-----------


Read more