రైతులకు చట్టబద్ధత కల్పించడమే లక్ష్యం : ఆర్డీవో

ABN , First Publish Date - 2022-05-19T02:50:02+05:30 IST

తమ భూములపై రైతులకు చట్టబద్ధంగా హక్కు కల్పించడమే ధ్యేయంగా జగనన్న శాశ్వత భూహక్కు - భూరక్ష పథకం

రైతులకు చట్టబద్ధత కల్పించడమే లక్ష్యం : ఆర్డీవో
ఈ శ్రమ్‌ కార్డు అందిస్తున్న ఆర్డీవో ఉమాదేవి

వరికుంటపాడు, మే 18: తమ భూములపై రైతులకు చట్టబద్ధంగా హక్కు కల్పించడమే ధ్యేయంగా జగనన్న శాశ్వత భూహక్కు - భూరక్ష పథకం కొనసాగుతుందని ఆర్డీవో ఉమాదేవి అన్నారు. బుధవారం స్ధానిక తహసీల్దారు కార్యాలయాన్ని ఆమె ఆకస్మికంగా తనిఖీ  చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పథకం కింద తూర్పుచెన్నం పల్లిలో రీసర్వేను పూర్తి చేసి రికార్డులను సిద్ధం చేస్తున్నా మన్నారు. ఐదు లేఅవుట్లపై ఉన్న కోర్టుకేసులను త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు చేపట్టి, ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తామన్నారు. అనంతరం సచివాలయాన్ని పరిశీలించి  సేవలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సంద ర్భంగా ఈ శ్రమ్‌ కార్టులను లబ్ధిదారులకు అందచేశారు. తదుపరి వేంపాడు రెవెన్యూలోని వేసిన లేఅవుట్‌ను పరిశీలించారు. కార్యక్రమంలో తహసీల్దారు హేమంత్‌కుమా ర్‌, ఎంపీడీవో సురే్‌షబాబు తదితరులు పాల్గొన్నారు. 

Read more