రైతు భరోసా కేంద్రం జేసీ తనిఖీ

ABN , First Publish Date - 2022-03-17T04:59:44+05:30 IST

పట్టణంలోని రైతు భరోసా కేంద్రాన్ని బుధవారం జేసీ హరేందిర ప్రసాద్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు.

రైతు భరోసా కేంద్రం జేసీ తనిఖీ
రైతు భరోసా కేంద్రం తనిఖీ చేస్తున్న జేసీ హరేందిర ప్రసాద్‌

 కోవూరు, మార్చి 16: పట్టణంలోని రైతు భరోసా కేంద్రాన్ని బుధవారం జేసీ హరేందిర ప్రసాద్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అలాగే రికార్డులను కూడా పరిశీలించారు. అనంతరం ధాన్యం కొనుగోలుకు సంబంధించి వివరాలు రాబట్టారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం మద్దతు ధర అందించేందుకు ఆర్బీకే సిబ్బంది కృషి చేయాలన్నారు. అనంతరం ఇనమడుగు రోడ్డు కూడలిలోని రైసు మిల్లులను తనిఖీ చేశారు. ఈ క్రమంలో అక్కడకు చేరుకున్న రైతులతో జేసీ మాట్లాడుతూ ధాన్యానికి మద్దతు ధర కల్పిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జిల్లా పౌర సరఫరాలశాఖ అధికారి వెంకటేశ్వర్లు, డిప్యూటీ తహసీల్దారు బషీర్‌ పాల్గొన్నారు.

Read more