రైలు ఢీకొని గుర్తు తెలియని మహిళ మృతి

ABN , First Publish Date - 2022-08-26T02:56:43+05:30 IST

రైలు ఢీ కొని గుర్తు తెలియని మహిళ (30) మృతి చెందింది. ఈ సంఘటన బుధవారం రాత్రి కావలి రైల్వేస్టేషన్‌లో జరిగింది. రైల్వే

రైలు ఢీకొని గుర్తు తెలియని మహిళ మృతి

కావలి రూరల్‌, ఆగస్టు25: రైలు ఢీ కొని గుర్తు తెలియని మహిళ (30) మృతి చెందింది. ఈ సంఘటన బుధవారం రాత్రి కావలి రైల్వేస్టేషన్‌లో జరిగింది. రైల్వే పోలీసుల వివరాల మేరకు, స్టేషన్‌కు దక్షిణాన ఆ మహిళ ట్రాక్‌ దాటుతున్న సమయంలో ఎగువమార్గంలో మచిలీపట్నం నుంచి తిరుపతి వెళ్లే ఎక్స్‌ప్రెస్‌ రైలు ఢీ కొంది. మృతదేహాన్ని పరిశీలించగా ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదు. ఆమె 5.4 అడుగుల ఎత్తు,  చామనఛాయతో రోజ్‌కలర్‌ చీర, పసుపుకలర్‌ బ్లౌజ్‌తోపాటు తెల్లని ఫుల్‌హ్యాండ్‌ చొక్కా ధరించి ఉన్నట్లు వారు తెలిపారు. చీరపై చొక్కా ధరించి ఉండటాన్ని బట్టి కూలిపనులకు వచ్చిన మహిళ అయి ఉంటుందని వారు అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఏరియా వైద్యశాలకు తరలించి ఎస్‌ఐ అరుణకుమారి కేసు నమోదు చేసి దర్యాప్తు  చేస్తున్నారని తెలిపారు.


--------------


Read more