ఆర్టీసీ బస్టాండ్‌ ఆధునికీకరణకు ప్రతిపాదనలు

ABN , First Publish Date - 2022-07-19T04:10:37+05:30 IST

కావలి ఆర్టీసీ బస్టాండ్‌ను ఆధునికీకరించాలన్న కావలి ఎమ్మెల్యే ప్రతాప్‌కుమార్‌ రెడ్డి సూచనల మేరకు సోమవారం ఆర్టీసీ యాజమాన్యం నెల్లూరు నుంచి ఇంజనీరింగ్‌ అధికారుల బృందాన్ని కావలికి పంపింది.

ఆర్టీసీ బస్టాండ్‌ ఆధునికీకరణకు ప్రతిపాదనలు
ఆర్టీసీ బస్టాండ్‌ ప్రాంగణాన్ని పరిశీలిస్తున్న ఇంజనీరింగ్‌ అధికారులు

పరిశీలించిన ఇంజనీరింగ్‌ అధికారులు

కావలి, జూలై 18: కావలి ఆర్టీసీ బస్టాండ్‌ను ఆధునికీకరించాలన్న కావలి ఎమ్మెల్యే ప్రతాప్‌కుమార్‌ రెడ్డి సూచనల మేరకు సోమవారం ఆర్టీసీ యాజమాన్యం నెల్లూరు నుంచి ఇంజనీరింగ్‌ అధికారుల బృందాన్ని కావలికి పంపింది. నెల్లూరుజోన్‌ ఎగ్జిక్యూటీవ్‌ ఇంజనీర్‌ కే. వెంకటేశ్వరరావు నేతృత్వంలో ఆ బృందం బస్టాండ్‌ ప్రాంతాన్ని పరిశీలించి ప్రతిపాదనలపై చర్చించారు. ఈ సందర్భంగా కావలి డిపో మేనేజరు రాపూరు శ్రీనివాసులు మాట్లాడుతూ నెల్లూరు నుంచి వచ్చిన ఇంజనీరింగ్‌ విభాగం అధికారులు అభివృద్ధి చేయవల్సిన పనులను గుర్తించారని, త్వరలో అంచనాలను సిద్ధం చేస్తారన్నారు. సంస్థ నిధులతో పాటు ప్రభుత్వ నిధులు, దాతల సహకారంతో బస్టాండ్‌ ఆధునీకరించనున్నామన్నారు. ఈ కార్యక్రమంలో డీఈఈ వై.సుభూషణం, ఏటీఎం దివ్యకామాక్షి, అసిస్టెంట్‌ మేనేజరు ట్రాపిక్‌ కేవీఆర్‌ బాబు, సీనియర్‌ ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎం.రామకృష్ణ, డిపో మార్కెటింగ్‌ ఎగ్జిక్యూటీవ్‌ డీ.రవిప్రకాష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-07-19T04:10:37+05:30 IST