తుమ్మలపెంట రోడ్డు వేసేవరకు పోరాటం

ABN , First Publish Date - 2022-10-04T03:35:16+05:30 IST

తుమ్మలపెంట రోడ్డు వేసే వరకు పోరాటం చేస్తామని టీడీపీ నాయకులు సోమవారం బురదగుంతల్లో కూర్చొని వినూత్న నిరసన చేప

తుమ్మలపెంట రోడ్డు వేసేవరకు పోరాటం
తుమ్మలపెంట రోడ్డులోని బురదలో పొర్లు దండాలు పెడుతున్న టీడీపీ నేత బాబూరావు

టీడీపీ వినూత్న నిరసన

కావలి, అక్టోబరు3: తుమ్మలపెంట రోడ్డు వేసే వరకు పోరాటం చేస్తామని టీడీపీ నాయకులు సోమవారం బురదగుంతల్లో కూర్చొని వినూత్న నిరసన చేపట్టారు.  నేతలంతా పార్టీ కార్యాలయం నుంచి మోటారుసైకిళ్లపై ర్యాలీగా తుమ్మలపెంట రోడ్డుకు చేరుకున్నారు. అక్కడ వారు రోడ్డుపై బురద గుంతల్లో కూర్చొని నిరసన తెలిపారు.  పట్టణ ప్రధాన కార్యదర్శి జ్యోతి బాబూరావు ఆ బురదలో పొర్లాడుతూ.. సీఎంకు ఓ దండం, ఎమ్మెల్యేకు రెండు దండాలంటూ వ్యంగ్యంగా అన్నారు. ఈ సందర్భంగా మాలేపాటి సుబ్బానాయుడు మాట్లాడుతూ  ఈ రోడ్డు విషయాన్ని గత నెలలో ఆర్‌అండ్‌బీ అధికారుల దృష్టికి తీసుకెళ్లగా, ఆ నెలాఖరుకు పనులు ప్రారంభిస్తామని చెప్పి నేటికీ చేపట్టలేదన్నారు. ఈ కార్యక్రమంలో  నేతలు మన్నవ రవిచంద్ర, గుత్తికొండ కిషోర్‌, అక్కిలగుంట సూరి, ఆవుల రామకృష్ణ, బొట్లగుంట శ్రీహరి నాయుడు, ఉప్పాల శ్రీను, ఉప్పాల వెంకయ్య  తదితరులు పాల్గొన్నారు.


Read more