-
-
Home » Andhra Pradesh » Nellore » road baguceyakante muttadi-MRGS-AndhraPradesh
-
తుమ్మలపెంట రోడ్డును బాగుచేయకుంటే ఆర్అండ్బీ కార్యాలయం ముట్టడి
ABN , First Publish Date - 2022-09-14T03:04:12+05:30 IST
కావలి-తుమ్మలపెంట రోడ్డు పనులను నెలలోపు ప్రారంభించకపోతే ఆర్అండ్బీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని టీడీపీ ఇ

కావలి, సెప్టెంబరు13: కావలి-తుమ్మలపెంట రోడ్డు పనులను నెలలోపు ప్రారంభించకపోతే ఆర్అండ్బీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని టీడీపీ ఇన్చార్జి మాలేపాటి సుబ్బానాయుడు పేర్కొన్నారు. మంగళవారం ఆయన పార్టీ నేతలతో కలిసి తుమ్మలపెంట రోడ్డులో పర్యటించారు. రోడ్డు గుంటలకు వైసీపీ రంగులు వేసి నిరసన తెలిపారు. అనంతరం ఆర్అండ్బీ కార్యాలయానికి వెళ్లి ఈఈ రామకృష్ణతో మాట్లాడారు. రోడ్డు పనులు త్వరలో ప్రాంభించకపోతే టీడీపీ ఆధ్వర్యంలో కార్యాల యాన్ని ముట్టడిస్తామని చెప్పి, వినతి పత్రం అందచేశారు. అనంతరం మాలేపాటి మాట్లాడుతూ గత టీడీపీ ప్రభుత్వ హయాంలో మంజూరైన ఈ రోడ్డుకు ఇంతవరకు ఎందుకు పనులు చేపట్టలేదన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు మలిశెట్టి వెంకటేశ్వర్లు, మ న్నవ రవిచంద్ర, జ్యోతిబాబూరావు, యేగూరి చంద్రశేఖర్, ఆవుల రామకృష్ణ, బొట్లగుంట శ్రీహరినాయుడు, బాలగురుస్వామి తదితరులు పాల్గొన్నారు.కాగా రోడ్డు పనులు ప్రారంభానికి తాము కసరత్తు చేస్తున్నామని, త్వరలో పనులు చేపడతామని ఈఈ రామకృష్ణ తెలిపారు.