రోడ్డు ప్రమాదంలో బేల్దారి దుర్మరణం

ABN , First Publish Date - 2022-10-04T04:46:32+05:30 IST

మండల పరిధిలోని జాతీయ రహదారిపై మనుబోలు జూనియర్‌ కళాశాల వద్ద సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో బేల్దారి శంకరయ్య (40) దుర్మరణం చెందాడు.

రోడ్డు ప్రమాదంలో   బేల్దారి దుర్మరణం
తీవ్ర గాయాలతో చంద్రశేఖర్‌

 మరొకరికి తీవ్ర గాయాలు


మనుబోలు, అక్టోబరు 3 : మండల పరిధిలోని జాతీయ రహదారిపై మనుబోలు జూనియర్‌ కళాశాల వద్ద సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో బేల్దారి శంకరయ్య (40) దుర్మరణం చెందాడు. పోలీసుల కథనం మేరకు... వారం రోజుల క్రితం కోవూరుకు చెందిన బేల్దారి చంద్రశేఖర్‌, తన స్నేహితుడైన మరో బేల్దారి కావలికి చెందిన శంకరయ్య బాలాయపల్లి మండలంలోని సుబ్రమణ్యం గ్రామంలో బేల్దారి పనుల నిమిత్తం వెళ్లారు. దసరా పండుగకు ఇంటికి వెళ్లేందుకు   బైక్‌పై సుబ్రమణ్యం గ్రామం నుంచి బయలుదేరారు. మనుబోలు వద్ద చెన్నై నుంచి కావలి వెళుతున్న కారు వేగంగా వచ్చి బైక్‌ను ఢీకొన్నది. దీంతో బైక్‌ బోల్తాపడి శంకరయ్య తల పగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. వెనుక కూర్చున్న చంద్రశేఖర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడ్ని చికిత్స నిమిత్తం 108లో నెల్లూరుకు తరలించారు. శవపరీక్ష నిమిత్తం శంకరయ్య మృతదేహాన్ని గూడూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

Read more