రెవెన్యూ సదస్సులో 25 అర్జీలు

ABN , First Publish Date - 2022-09-18T03:38:05+05:30 IST

చుక్కల భూముల సమస్యలు, ఇతర భూసమస్యల పరిష్కారం కోసం శనివారం కందుకూరులో నిర్వహించిన ప్రత్యేక రెవెన్యూ సదస్సులో రైతు

రెవెన్యూ సదస్సులో 25 అర్జీలు
రెవెన్యూ సదస్సులో అర్జీలు పరిశీలిస్తున్న ఆర్డీవో

 కందుకూరు, సెప్టెంబరు 17: చుక్కల భూముల సమస్యలు, ఇతర భూసమస్యల పరిష్కారం కోసం శనివారం కందుకూరులో నిర్వహించిన ప్రత్యేక రెవెన్యూ సదస్సులో రైతులు 25 అర్జీలు అందజేశారు. ఆర్డీవో జీవీ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో స్థానిక మండల పరిషత్‌ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన ఈ సదస్సులో తహసీల్దార్‌ సీతారామయ్యపాటు రెవెన్యూ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ రెవెన్యూ సమస్యల సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. 

Read more