రీసర్వేను సమర్థంగా నిర్వహించాలి : జేసీ

ABN , First Publish Date - 2022-09-14T03:01:49+05:30 IST

ప్రతి మండలంలో రీసర్వేను సమర్థవంతంగా నిర్వహించాలని జేసీ కూర్మనాథ్‌ పేర్కొన్నారు. మంగళవారం ఆయన అల్లూ

రీసర్వేను సమర్థంగా నిర్వహించాలి : జేసీ
రీసర్వే రికార్డులను పరిశీలిస్తున్న జేసీ కూర్మనాథ్‌

అల్లూరు, సెప్టెంబరు 13 : ప్రతి మండలంలో రీసర్వేను సమర్థవంతంగా నిర్వహించాలని  జేసీ కూర్మనాథ్‌ పేర్కొన్నారు. మంగళవారం ఆయన అల్లూరు మండలంలో పర్యటించారు. ముందుగా తహసీల్దారు కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రద్దగుంటలో నిర్వహించిన రీసర్వే గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పెండింగ్‌లో ఉన్న సర్వేనెంబర్లను వెంటనే పరిష్కరించాలని  తహసీల్దారు శ్రీరామకృష్ణను ఆదేశించారు. అనంతరం సింగపేట సచివాలయాన్ని సందర్శించి , వివరాలు అడిగి తెలుసుకున్నారు.  వెలిచర్లలో రీసర్వేను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఐ సుధీర్‌, వీఆర్వోలు,  రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. 


Read more