-
-
Home » Andhra Pradesh » Nellore » restaion biyyam pattiveta-MRGS-AndhraPradesh
-
20 టన్నుల రేషన్‌బియ్యం పట్టివేత
ABN , First Publish Date - 2022-07-06T03:11:59+05:30 IST
ప్రకాశం జిల్లా కేంద్రంగా చెన్నైకి తరలిపోతున్న రేషన్‌బియ్యాన్ని మంగళవారం విజిలెన్స్ అధికారులు వలపన్ని పట్టుకున్నారు

మనుబోలు, జూలై 5: ప్రకాశం జిల్లా కేంద్రంగా చెన్నైకి తరలిపోతున్న రేషన్‌బియ్యాన్ని మంగళవారం విజిలెన్స్ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. ఒకటి కాదు..రెండు కాదు..ఏకంగా 20టన్నుల రేషన్‌బియ్యం తరలిస్తున్న లారీని వెంబడించి మనుబోలు మండలం కొమ్మలపూడి క్రాస్‌రోడ్డు వద్ద దాడులు చేసి లారీడ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని, లారీని స్వాధీనం చేసుకున్నారు. విజిలెన్స్ ఎస్పీ రాజేష్‌రెడ్డి ఆదేశాలతో పక్కా సమాచారం అందుకున్న విజిలెన్స్ అధికారులు సీఐ మాణిక్యరావు ఆధ్వర్యంలో ఈ దాడులు జరిగాయి. పట్టుబడిన లారీలో 50కేజీ బస్తాలు 520వరకు ఉన్నాయి. వీటి విలువ రూ. 5.72లక్షలు. లారీతో కలిపి రూ.15.72లక్షలుగా రికార్డు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. రేషన్‌బియ్యం తరలింపుపై 6ఏతోపాటు క్రిమినల్ కేసు నమోదు చేయనున్నట్లు ఆయన తెలిపారు. పట్టుబడిన లారీని స్థానిక పోలీస్‌స్టేషన్‌లో అప్పగించారు. ఈ దాడుల్లో జేఎస్‌వో రవిబాబు , సీఎస్‌డీటీ లక్ష్మీనారాయణరెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.