ఎర్రచందనం సంపదను కాపాడుకుందాం!

ABN , First Publish Date - 2022-10-07T05:09:23+05:30 IST

‘‘కనకదుర్గమ్మ అమ్మవారికి ఎర్రచందనం ఎంతో ప్రీతిపాత్రమైంది. దసరా ఉత్సవాల్లో అమ్మవారికి చందనం వినియోగించడం జరిగింది.

ఎర్రచందనం సంపదను కాపాడుకుందాం!
పంగిలి భూములను పరిశీలిస్తున్న డీఎఫ్‌వో చంద్రశేఖర్‌

తమిళ వాసులు కనిపిస్తే ఫొటో తీయండి

డీఎఫ్‌వో చంద్రశేఖర్‌

 

రాపూరు, అక్టోబరు 6: ‘‘కనకదుర్గమ్మ అమ్మవారికి ఎర్రచందనం ఎంతో ప్రీతిపాత్రమైంది. దసరా ఉత్సవాల్లో అమ్మవారికి చందనం వినియోగించడం జరిగింది. అటువంటి విలువైన సంపదను కాపాడుకోవడం మనందరి బాధ్యత’’ అని డీఎ్‌ఫవో చంద్రశేఖర్‌ అన్నారు. స్థానిక రేంజి కార్యాలయంలో గురువారం రాత్రి అటవీ అధికారులతో సమావేశం నిర్వహించి, ఆయన మాట్లాడుతూ తమిళనాడు వాసులు, కొత్త వ్యక్తులు కనిపిస్తే ఫొటో తీసి అటవీ, పోలీసులకు సమాచారం అందించాలన్నారు.  వారి పేర్లను గోప్యంగా ఉంచుతామన్నారు. ఇటీవల రేంజి పరిధిలో దొరికిన హై క్వాలిటీ చందనం, ఒకరి హత్య జరిగిన విషయాన్ని సమీక్షించారు. అనంతరం ప్రకృతి వనరులైన అడవులు, ఎర్రచందనం, స్మగ్లింగ్‌, చెక్‌పోస్టుల ఆధునికీకరణ తదితర విషయాలను వివరించారు. ఎర్రచందనం స్మగ్లింగ్‌తో ఆస్తులు సంపాదించినట్లు తేలితే వాటినన్నింటిని స్వాధీనం చేసుకుంటామన్నారు. తొలుత కోన  శ్రీవార్లను దర్శించుకున్నారు. అనంతరం ఎకో సెంటర్‌, పంగిలి సమస్మాత్మక భూములు, చెక్‌పోస్టును పరిశీలించారు. ఆయన వెంట రేంజర్‌ రవీంద్రబాబు, సిబ్బంది ఉన్నారు.  


పంగిలి భూములపై సమగ్ర ప్రణాళిక

పంగిలి భూములపై జిల్లా అధికారుల పర్యవేక్షణలో సమగ్ర ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. పంగిలి భూముల్లో అటవీ భూములు ఆక్రమణలు లేవని, ఇక్కడ 1,806 ఎకరాల అటవీ పోరంబోకు భూములు సాగులో ఉన్నట్లు గుర్తించామన్నారు.  

Read more