రీసర్వే పకడ్బందీగా నిర్వహించాలి : ఆర్డీవో

ABN , First Publish Date - 2022-10-04T04:18:04+05:30 IST

డివిజన్‌లో జరుగుతున్న రీ సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని ఆర్డీవో శీనానాయక్‌ తెలిపారు. ఆర్డీవో కార్యాలయంలో సోమవారం

రీసర్వే పకడ్బందీగా నిర్వహించాలి : ఆర్డీవో
అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్న ఆర్డీవో శీనానాయక్‌

కావలి, అక్టోబరు3:కావలి డివిజన్‌లో జరుగుతున్న రీ సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని  ఆర్డీవో శీనానాయక్‌ తెలిపారు. ఆర్డీవో కార్యాలయంలో సోమవారం సాయంత్రం డివిజన్‌లోని  తహసీల్దార్లు,  డీటీలు, సర్వేయర్లు, వీఆర్వోలతో ఆయన సమీక్ష నిర్వహించారు. భూముల రీసర్వేపై అనుసరించాల్సిన విధివిధానాలపై, సర్వేలో ఎదురవుతున్న సమస్యలపై, ఓటర్ల జాబితాలో చేర్పులు, మార్పులు, ఆధార్‌ అనుసంధానం, ఈ క్రాప్‌కు రెవెన్యూ సర్టిఫికెట్ల జారీ తదితర అంశాలపై మండలాల వారీగా సమీక్ష నిర్వహించారు. 


Read more