-
-
Home » Andhra Pradesh » Nellore » ration dealers protest-NGTS-AndhraPradesh
-
రేషన్ డీలర్ల నిరసన
ABN , First Publish Date - 2022-07-05T05:34:27+05:30 IST
తహసీల్దారు కార్యాలయం ఎదుట రేషన్ డీలర్లు సోమవారం నిరసన వ్యక్తం చేశారు. ప్రజా పంపిణీ వ్యవస్థలో ప్రభుత్వ నిర్ణయాలతో

ఆత్మకూరు, జూలై 4 : తహసీల్దారు కార్యాలయం ఎదుట రేషన్ డీలర్లు సోమవారం నిరసన వ్యక్తం చేశారు. ప్రజా పంపిణీ వ్యవస్థలో ప్రభుత్వ నిర్ణయాలతో రేషన్ డీలర్లకు ఆదాయ భద్రతకు గ్యారంటీ లేకుండా పోయిందని డీలర్ల సంక్షేమ సంఘం మండల అధ్యక్షుడు షేక్ మస్తాన్‌వలి ఆవేదన వ్యక్తం చేశారు. డోర్ డెలివరీ విధానం తీసుకొచ్చి నిర్వాహకులకు జీతం, హమాలీ ఖర్చులు, పెట్రోల్ ఖర్చులు ఇస్తున్నారన్నారు. అయితే రేషన్ డీలర్లకు మాత్రం కమీషన్ నుంచే ఖర్చులు భరాయించాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలు పరిష్కరించి ఆదాయ భరోసా కల్పించాలని కోరారు. అనంతరం పలువురు డీలర్లు స్పందన కార్యక్రమంలో తహసీల్దారు సోమ్లాబనావత్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో రేషన్ డీలర్లు సంక్షేమ సంఘం నాయకులు, పలువురు డీలర్లు పాల్గొన్నారు.