రంగనాథుడి ఆలయ భూమి వేలం

ABN , First Publish Date - 2022-09-29T04:09:46+05:30 IST

మండలంలోని సౌత్‌ఆములూరులో బుధవారం తల్పగిరి రంగనాథస్వామి ఆలయ భూములకు 2022, 2023, 2024, 2025

రంగనాథుడి ఆలయ భూమి వేలం
వేలం నిర్వహిస్తున్న అధికారులు

తోటపల్లిగూడూరు, సెప్టెంబరు 28:  మండలంలోని సౌత్‌ఆములూరులో బుధవారం తల్పగిరి రంగనాథస్వామి ఆలయ భూములకు 2022, 2023, 2024, 2025 సంవత్సరాలకుగాను కౌలు లీజు వేలం పాటలను ఆలయం ఈవో డీ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో  నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ గత  ఏడాది ఈ భూముల ద్వారా రూ. 7,61,000 మక్తారూపంలో రాగా, ప్రస్తుతం పాటల ద్వారా 9,46,600 వచ్చిందని తెలిపారు.  వేలం పాటల్లో తల్పగిరి రంగనాథస్వామి ఆలయ సిబ్బందితో పాటు స్థానిక కౌలుదారులు పాల్గొన్నారు. 


Read more