ప్రజా పంపిణీకి పోర్టిఫైడ్‌ రైస్‌ సరఫరా

ABN , First Publish Date - 2022-09-09T02:56:26+05:30 IST

రాష్ట్రంలో త్వరలో ప్రజాపంపిణీకి కూడా పోర్టిఫైడ్‌ రైస్‌ సరఫరా చేసేలా రాష్ట్రప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర

ప్రజా పంపిణీకి పోర్టిఫైడ్‌ రైస్‌ సరఫరా
బోగోలులో చిన్నారులతో మాట్లాడుతున్న రాష్ట్ర ఆహార కమిషన్‌ చైర్మన్‌ విజయప్రతాప్‌రెడ్డి

- రాష్ట్ర ఆహార కమిషన్‌ చైర్మన్‌

కావలి, సెప్టెంబరు8: రాష్ట్రంలో త్వరలో ప్రజాపంపిణీకి కూడా పోర్టిఫైడ్‌ రైస్‌ సరఫరా చేసేలా రాష్ట్రప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర ఆహార కమిషన్‌ చైర్మన్‌ సీహెచ్‌. విజయప్రతాప్‌రెడ్డి పేర్కొన్నారు. ఇప్పటికే అంగన్‌వాడీలకు, పాఠశాలల మధ్యాహ్న భోజన పఽథకానికి పోర్టిఫైడ్‌ రైస్‌ సరఫరా చేస్తున్నామన్నారు.  గురువారం సాయంత్రం కావలి మద్దూరుపాడులో ఉన్న ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ను తనిఖీ చేసి, సరుకుల తూకాలు సక్రమంగా ఉన్నాయా..లేదా ? అని పరిశీలించారు. డీటీ వెంకట్రామిరెడ్డిని అడిగి అక్కడ సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం రేషన్‌ డీలర్లను పిలిచి ‘మీకు బియ్యం సక్రమంగా తూకాలు వేసి ఇస్తున్నారా.. తగ్గించి ఇస్తున్నారా... నాణ్యతమైన సరుకులు ఇస్తున్నారా.. అని ఆరా తీశారు. దీనిపై స్థానిక డీలర్లతోపాటు డీలర్స్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు సుదర్శన రమేష్‌ సమాధానమిస్తూ కావలి పాయింట్‌ నుంచి తూకాలు సక్రమంగానే ఉన్నాయన్నారు. కానీ జిల్లాలో అనేక ఎంఎల్‌ఎస్‌ పాయింట్లలో బస్తాకు రెండు, మూడు కేజీలు తగ్గించి ఇస్తున్నారని చెప్పారు. అనంతరం మద్దూరుపాడులోని కర్నాటి రమేష్‌ రైస్‌ మిల్లును, ఉదయగిరి రోడ్డులో జమ్మలపాలెం వద్ద ఉన్న ఈతముక్కల మురళీ రైస్‌మిల్లును తనిఖీ చేశారు.  అనంతరం వెంగళరావునగర్‌లోని బీసీ వసతి గృహాన్ని పరిశీలించి అక్కడ విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందుతుందా.. లేదా? చదువులు ఎలా  ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు.


 మెనూ ప్రకారం ఆహారం పంపిణీ చేయకుంటే సహించం


బిట్రగుంట, సెప్టెంబరు 8: విద్యార్థులకు మెనూ ప్రకారం ఆహారం పంపిణీ చేయకుంటే సహించబోమని రాష్ట్ర ఆహార కమిషన్‌ చైర్మన్‌ సీహెచ్‌. విజయప్రతాప్‌రెడ్డి అన్నారు. గురువారం ఆయన బోగోలు మండలంలోని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ గురుకుల పాఠశాలను, ధాన్యం నిల్వ చేసే గోదాములను తనిఖీ చేశారు. గురుకులంలో తాగునీటి సమస్యను ఆయన దృష్టికి తీసుకురావడంతో జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి సమస్య పరిష్కరిస్తామన్నారు. అనంతరం గోదాముల వద్దకు వెళ్లి రేషన్‌షాపులకు అందచేస్తున్న బియ్యం కొలతల్లో తేడా వస్తున్నదనే విషయమై ఆరా తీశారు. ఆయన వెంట డిప్యూటి డైరెక్టర్‌ సురేష్‌, డీఎస్‌వో వెంకటేశ్వర్లు, డీసీవో హేమలత, ఆర్డీవో శీనానాయక్‌, తహసీల్దారు లక్ష్మీనారాయణ, సీడీపీవో పద్మజాకుమారి, ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌ అనురాఽధ తదితరులు ఉన్నారు. 




Updated Date - 2022-09-09T02:56:26+05:30 IST