అన్నీ రంగాల్లో ప్రభుత్వం విఫలం : బీజేపీ

ABN , First Publish Date - 2022-12-30T00:38:25+05:30 IST

రాష్ట్రప్రభుత్వం అన్నీ రంగాల్లో విఫలమైందని వైసీపీ ఎమ్మెల్యేలే బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారని వెంకటగిరి నియోజకవర్గ బీజేపీ ఇన్‌చార్జి ఎస్‌ఎస్‌నాయుడు అన్నారు. రాపూరులోని

అన్నీ రంగాల్లో ప్రభుత్వం విఫలం : బీజేపీ
విలేకరులతో మాట్లాడుతున్న ఎస్‌ఎస్‌ఆర్‌ నాయుడు

రాపూరు, డిసెంబరు 29: రాష్ట్రప్రభుత్వం అన్నీ రంగాల్లో విఫలమైందని వైసీపీ ఎమ్మెల్యేలే బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారని వెంకటగిరి నియోజకవర్గ బీజేపీ ఇన్‌చార్జి ఎస్‌ఎస్‌నాయుడు అన్నారు. రాపూరులోని తెలుగుగంగ అతిఽథి గృహం అవరణలో గురువారం కార్యకర్తల సమావేశం జరిగింది. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఎస్‌ఎస్‌కెనాల్‌ అన్నీ పార్టీలకు ఎన్నికలవేళ మాత్రమే గుర్తుకువస్తుందన్నారు. 40ఏళ్లుగా ఇప్పటికీ కండలేరు నిర్వాసితుల సమస్యలు పరిష్కారం కాలేదన్నారు. రాష్ట్రంలో కేవలం కేంద్ర ప్రభుత్వ పథకాలే అమలవుతున్నాయని తెలిపారు. కొన్ని అమలుకు నోచుకోకపోవడం దారుణమని పేర్కొన్నారు. బీజేపీకి ఒక్కసారి అవకాశం ఇవ్వాలన్నారు. పల్లె నుంచి పట్నం వరకూ చిన్న కాలువ నుంచి పెద్ద పెద్ద ప్రాజెక్టుల వరకూ పూర్తికావాలంటే రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావాల్సివుందన్నారు. కార్యక్రమంలో నాయకులు పెంచలయ్య, వెంకటరత్నం, గోపాల్‌, ప్రదీప్‌రెడ్డి, శీనయ్య, కృపావతి, బుజ్జమ్మ తదితరులు పాల్గొన్నారు. పలువురు పార్టీలో చేరడంతో బీజేపీ కండువావేసి వారిని ఆహ్వానించారు.

Updated Date - 2022-12-30T00:38:25+05:30 IST

Read more