పౌష్టికాహారంతో సంపూర్ణ ఆరోగ్యం

ABN , First Publish Date - 2022-10-01T04:41:21+05:30 IST

స్థానిక ఏఎస్‌ఆర్‌ డిగ్రీ కళాశాల ఎన్‌ఎస్‌ఎస్‌ యూనిట్‌ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో ‘పోషక విలువలతో కూడిన ఆహారం’ అనే అంశంపై ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.

పౌష్టికాహారంతో సంపూర్ణ ఆరోగ్యం
బాలింతలకు పండ్లు, రొట్టెలు అందజేస్తున్న ఆర్‌ఎంవో డాక్టర్‌ ఉషాసుందరి

ఆత్మకూరు, సెప్టెంబరు 30 : స్థానిక ఏఎస్‌ఆర్‌ డిగ్రీ కళాశాల ఎన్‌ఎస్‌ఎస్‌ యూనిట్‌ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో ‘పోషక విలువలతో కూడిన ఆహారం’ అనే అంశంపై ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ సుబ్బారెడ్డి, ఆర్‌ఎంవో డాక్టర్‌ ఉషాసుందరి మాట్లాడుతూ ప్రొటీన్లు, విటమిన్లు, పౌష్టికాహారం వల్ల కలిగే లాభాల గురించి వివరించారు. దీనివల్ల సంపూర్ణ ఆరోగ్యం పొందవచ్చని గర్భిణులకు   సూచించారు. అనంతరం ఎన్‌ఎస్‌ఎస్‌ వలంటీర్లు రోగులకు పండ్లు, రొట్టెలు అందజేశారు. కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్‌ ఎం. సుబ్బారెడ్డి, ప్రిన్సిపాల్‌ డి. ప్రసాద్‌, ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగామ్‌ ఆఫీసర్లు జి మస్తాన్‌, టి మాలకొండయ్య పాల్గొన్నారు.


Read more