భక్తిశ్రద్ధలతో పోలిస్వర్గం పూజలు

ABN , First Publish Date - 2022-11-24T22:26:12+05:30 IST

కార్తీకమాసం ముగింపు సందర్భంగా గురువారం పోలిస్వర్గం పూజలను మహిళలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. పట్టణంలోని సోమేశ్వరాలయం, అయ్యప్పస్వామి ఆలయం, పెద్దబజారులోని కోదండరామ స్వామి ఆలయంలోనూ పోలిస్వర్గం సందర్భంగా మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించి కార్తీక దీపాలను వెలిగించారు

  భక్తిశ్రద్ధలతో పోలిస్వర్గం పూజలు
కోదండరామస్వామి ఆలయం వద్ద పుష్కరిణిలో కార్తీకదీపాలు వదులుతున్న మహిళలు

కందుకూరు, నవంబరు 24: కార్తీకమాసం ముగింపు సందర్భంగా గురువారం పోలిస్వర్గం పూజలను మహిళలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. పట్టణంలోని సోమేశ్వరాలయం, అయ్యప్పస్వామి ఆలయం, పెద్దబజారులోని కోదండరామ స్వామి ఆలయంలోనూ పోలిస్వర్గం సందర్భంగా మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించి కార్తీక దీపాలను వెలిగించారు. రెవెన్యూ కాలనీలోని కోదండరామాలయంలో ఆలయ పూజారి శ్రీనివాసమూర్తి ఆధ్వర్యంలో మహిళలు పోలిస్వర్గం పూజలు ఘనంగా నిర్వహించారు. పుష్కరిణిలో కార్తీకదీపాలను వదిలారు. కార్యక్రమంలో ఆలయ పెద్దలు మన్నేపల్లి వరప్రసాదరావు, బిట్రగుంట మురళి, వరలక్ష్మి, విజయ, నీరజ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-24T22:26:12+05:30 IST

Read more