పోలీసుల సంక్షేమమే ఎస్పీ లక్ష్యం

ABN , First Publish Date - 2022-09-11T04:01:25+05:30 IST

పోలీసుల ఆరోగ్య భద్రతపై జిల్లా ఎస్పీ సీహెచ్‌ విజయరావు ప్రత్యేక దృష్టి సారించారని సీఐ వేణుగోపాల్‌రెడ్డి తెలిపారు. శ

పోలీసుల సంక్షేమమే ఎస్పీ లక్ష్యం
పోలీసులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్న వైద్య సిబ్బంది

ఆత్మకూరు, సెప్టెంబరు 10: పోలీసుల ఆరోగ్య భద్రతపై జిల్లా ఎస్పీ సీహెచ్‌ విజయరావు ప్రత్యేక దృష్టి సారించారని సీఐ వేణుగోపాల్‌రెడ్డి తెలిపారు.  శనివారం ఆత్మకూరు సర్కిల్‌ పరిధిలోని పోలీసులకు స్థానిక జిల్లా ప్రభుత్వ వైద్యశాల్లో ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహించారు. సర్కిల్‌ పరిధిలోని ఎస్‌ఐలు, పోలీసులు హాజరై పరీక్షలు చేయించుకున్నారు.  పరీక్షలను హాస్పిటల్‌ సూపరింటెండెంట్‌ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు.


ఎల్‌ఆర్‌పల్లిలో..


ఆత్మకూరులోని  ఎల్‌ఆర్‌పల్లి ఎస్టీ మోడల్‌ కాలనీలో శనివారం వైద్యశిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో చర్మవాధిగ్రస్థులను గుర్తించి, వారిని జిల్లా వైద్యశాలకు తీసుకెళ్లి చర్మవాధుల స్పెషలిస్ట్‌ వద్ద పరీక్షలు చేయించి మందులు  పంపిణీ చేశారు. కార్యక్రమంలో డాక్టర్‌ రాకేష్‌, జేవీవీ నాయకులు ఎల్‌ కృష్ణప్రసాద్‌, వాగాల శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.

Read more