కందమూరులో పొదుపు నిధుల స్వాహా

ABN , First Publish Date - 2022-10-01T04:33:42+05:30 IST

మండలంలోని కందమూరు గ్రామంలో ఓ మహిళ పొదుపు గ్రూపుల నిధులను స్వాహా చేసిన సంఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది.

కందమూరులో పొదుపు నిధుల స్వాహా

 పోలీసులను ఆశ్రయించిన బాధితులు?

నెల్లూరురూరల్‌, సెప్టెంబరు 30 : మండలంలోని కందమూరు గ్రామంలో ఓ మహిళ పొదుపు గ్రూపుల నిధులను స్వాహా చేసిన సంఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది.  సమాచారం మేరకు.. గ్రామంలోని దళితవాడకు చెందిన ఓ మహిళ పొదుపు గ్రూపులకు నాయకత్వం వహిస్తోంది. బ్యాంకుల నుంచి గ్రూపుల్లోని సభ్యులకు వచ్చే నిధులను దారి  మళ్లిస్తూ వచ్చింది. ఆ విషయం తెలుసుకున్న బాధితులు ఒక్కొకరుగా బయటకు వచ్చారు. ఈ క్రమంలో గ్రూపుల్లోని సభ్యులంతా  తమకు నిధులు చేరలేదని చెప్పడంతో రూ. లక్షల్లో స్వాహా చేసినట్లు ప్రాథమికంగా గుర్తించారు. గ్రామంలోని ఇతర వ్యక్తుల వద్ద కూడా ఆమె భారీగా అప్పు తీసుకుని ఇవ్వలేదని తెలిసింది. మొత్తంగా రూ. 40 లక్షల వరకు ఆమె దారి మళ్లిచ్చినట్లు సభ్యులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. కాగా ఈ విషయమై ఏపీఎం సరితను వివరణ కోరగా గ్రూపుల వారీగా ఆడిట్‌ జరుగుతోందని, త్వరలో పూర్తి వివరాలు

Updated Date - 2022-10-01T04:33:42+05:30 IST