పీహెచ్‌సీని తనిఖీ చేసిన పీవో

ABN , First Publish Date - 2022-12-09T23:00:01+05:30 IST

స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శుక్రవారం జిల్లా ప్రోగ్రామ్‌ అధికారి డా. దయాకర్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు.

 పీహెచ్‌సీని తనిఖీ చేసిన పీవో
వైద్యసిబ్బందిని ప్రశ్నిస్తున్న పీవో దయాకర్‌

మనుబోలు, డిసెంబరు 9: స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శుక్రవారం జిల్లా ప్రోగ్రామ్‌ అధికారి డా. దయాకర్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలించినప్పుడు ఇద్దరు ఉద్యోగులు సెలవు పెట్టి విధులకు హాజరుకోకపోవడంతో మిగతా వైద్య సిబ్బందిపై చిర్రుబుర్రులాడారు. సెలవులు పెడితే వారు చేయాల్సిన విధులు ఎవరు నిర్వహిస్తారంటూ ప్రశ్నించారు. తనకు తెలియకుండా సెలవు ఎలా ఇచ్చారంటూ మండిపడ్డారు. కార్యక్రమంలో వైద్యురాలు గేయపూజిత, సీహెచ్‌వో రాజయ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-09T23:00:22+05:30 IST