వైఎస్సార్‌ పేరు పెట్టమని ఎవరు అడిగారు ?

ABN , First Publish Date - 2022-09-29T04:27:57+05:30 IST

ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీకి వైఎస్సార్‌ పేరు పెట్టమని ఎవరు అడిగారని మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి సీఎం జ

వైఎస్సార్‌ పేరు పెట్టమని ఎవరు అడిగారు ?
విలేకరులతో మాట్లాడుతున్న పోలంరెడ్డి


 బుచ్చిరెడ్డిపాళెం,సెప్టెంబరు28:  ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీకి వైఎస్సార్‌ పేరు పెట్టమని ఎవరు అడిగారని మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి సీఎం జగన్‌ను ప్రశ్నించారు. బుధవారం బుచ్చి టీడీపీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వం చేయాల్సిన అభివృద్ధిని విస్మరించి, దుర్మార్గాలు, రౌడీ పరిపాలనతో జగన్‌ రాష్ట్ర ప్రజలను ఆందోళనకు గురిచేశారని విమర్శించారు.  ఎన్టీఆర్‌ పేరు మార్పుపై మీ నాన్న రాజశేఖర్‌రెడ్డి ఆత్మకూడా క్షోభిస్తుందన్నారు. మాజీ మంత్రిగా చెప్పుకుంటున్న నీకు ఆ పదవి ఎవరిచ్చారో గుర్తు చేసుకోవాలని ప్రసన్ననుద్దేశించి  పోలంరెడ్డి అన్నారు. చంద్రబాబును, బాలకృష్ణను  విమర్శించడానికి  నీకు సిగ్గు లేదా ? అని మండిపడ్డారు. హెల్త్‌ యూనివర్సిటీకి పేరు మార్పుపై నిర్వహించాల్సిన నిరాహార దీక్షను వర్షంతో తాత్కాలికంగా వాయిదా వేసినట్టు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో  పార్టీ నాయకులు ఎంవీ శేషయ్య,  బత్తల హరికృష్ణ, కావలి వెంకటేశ్వర్లు, నెల్లూరు ప్రభాకర్‌రెడ్డి, కే సురేష్‌రెడ్డి, సీహెచ్‌ కృష్ణచైతన్య, తాళ్ల నరసింహస్వామి, కౌన్సిలర్‌ జూగుంట కళ్యాణ్‌ తదితరులు పాల్గొన్నారు.


Read more