-
-
Home » Andhra Pradesh » Nellore » people agitation-MRGS-AndhraPradesh
-
దుమ్మూ దూళితో ఇబ్బందులపై ఆందోళన
ABN , First Publish Date - 2022-09-12T04:58:41+05:30 IST
సంగం బ్యారేజీ వైపు వెళ్లే వాహన రాకపోకల వల్ల దుమ్మూ దూళితో ఇబ్బందులు పడుతున్నామని ఆదివారం ఆ ప్రాంత కాలనీవాసులు ఆందోళనకు దిగారు.

స్తంభించిన వాహనాల రాకపోకలు
సంగం, సెప్టెంబరు 11: సంగం బ్యారేజీ వైపు వెళ్లే వాహన రాకపోకల వల్ల దుమ్మూ దూళితో ఇబ్బందులు పడుతున్నామని ఆదివారం ఆ ప్రాంత కాలనీవాసులు ఆందోళనకు దిగారు. దాంతో వాహన రాకపోకలు స్తంభిం చాయి. ఆనకట్టకు, బ్యారేజీకి మధ్యలో రహదారి పక్కన ఎస్సీ కాలనీ ఉంది. ఆనకట్ట నుంచి బ్యారేజీ వంతెన మీదకు వెళ్లే మార్గంలో తారు రోడ్డు వేయాల్సి ఉండగా సీఎం ప్రారంభోత్సవానికి సమయం లేకపోవడంతో వెట్‌మిక్స్ వేసి రోలింగ్ చేసి వదిలేశారు. ప్రస్తుతం వాహన రాకపోకలవల్ల వస్తున్న దుమ్మూ దూళితో తాము సమస్యను ఎదుర్కొంటున్నామని, రహదారిపై ట్యాంకర్‌తో నీళ్లు పెట్టాలని రాకపోకలను అడ్డుకుని ఆందోళనకు దిగారు. దీంతో వాహనరాకపోకలు నిలిచిపోయి గందరగోళంగా ఏర్పడింది. బ్యారేజీ నిర్వాహకులు వచ్చి సోమవారం నుంచి ట్యాంకర్‌తో నీళ్లు పెడతామని చెప్పడంతో ఆందోళన విరమించారు.