పెన్నాలో గిరిజన మత్స్యకారుడు గల్లంతు

ABN , First Publish Date - 2022-10-19T05:04:13+05:30 IST

మండలంలోని మక్తాపురం గ్రామానికి సమీపంలోని పెన్నానదిలో మంగళవారం సాయంత్రం చేపల వేట కు వెళ్లి ఓ గిరిజన మత్స్యకారుడు గల్లంతయ్యాడు.

పెన్నాలో గిరిజన మత్స్యకారుడు గల్లంతు
గల్లంతైన యువకుడు నరసింహులు (ఫైల్‌)

 సంగం, అక్టోబరు 18: మండలంలోని మక్తాపురం గ్రామానికి సమీపంలోని పెన్నానదిలో మంగళవారం సాయంత్రం చేపల వేట కు వెళ్లి ఓ గిరిజన మత్స్యకారుడు గల్లంతయ్యాడు. పోలీసుల కథ నం మేరకు..  మక్తాపురానికి చెందిన కత్తి నరసింహులు (32) స్థానిక గిరిజనులతో కలిసి పెన్నానదిలో చేపల వేటకు వెళ్లాడు. తిరిగి వచ్చే సమయంలో నీటి ఉధృతికి నరసింహులు గల్లంతయ్యాడు. దీంతో తోటి మత్స్యకారులు కాపాడే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. సమాచారం అందుకున్న సంగం ఎస్‌ఐ నాగార్జునరె డ్డి  ఘటనా స్థలానికి వెళ్లి విచారించారు. గల్లంతైన యువకుడి కో సం గాలింపు చర్యలు చేపట్టారు. రాత్రి కావడంతో ఆచూకీ లభ్యం కాలేదు. యువకుడికి భార్య, పిల్లలు ఉన్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.  

Read more