-
-
Home » Andhra Pradesh » Nellore » paryvarana parirasna pratiokkri fkigg-MRGS-AndhraPradesh
-
పర్యావరణ పరిరక్షణ ప్రతిఒక్కరి బాధ్యత : కలెక్టర్
ABN , First Publish Date - 2022-09-18T03:28:20+05:30 IST
పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతని కలెక్టర్ చక్రధర్‌బాబు తెలిపారు. శనివారం కృష్ణపట్నం సముద్రతీరంలో కోస్ట్‌గార్డ్ శాఖ ఆ

ముత్తుకూరు, సెప్టెంబరు 17: పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతని కలెక్టర్ చక్రధర్‌బాబు తెలిపారు. శనివారం కృష్ణపట్నం సముద్రతీరంలో కోస్ట్‌గార్డ్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కోస్టల్ క్లీనప్ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్లాస్టిక్ వ్యర్ధాలతో తీవ్రఇబ్బందులు పడతామని, వాటి వినియోగాన్ని తగ్గించుకోవాలన్నారు. రాష్ట్రంలో స్వచ్ఛ గ్రామాలు అభివృద్ధి చేసేందుకు సీఎం జగన్మోహన్‌రెడ్డి అక్టోబరు 2నుంచి నెలపాటు ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేశారని తెలిపారు. అనంతరం కాలేజీ, స్కూల్ విద్యార్థులు, ఎన్‌సీసీ క్యాడెట్లు, స్థానికులతో కలిసి కలెక్టర్ సముద్ర తీరంలో ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించారు. కోస్టల్ క్లబ్‌డే సందర్భంగా 700 మందిపైగా వలంటీర్లతో సముద్ర తీరంలో చెత్తను తొలగించి ప్లాస్టిక్, నాన్ ప్లాస్టిక్ వ్యర్థాలను వేర్వేరుగా సేకరిస్తున్నామని కోస్ట్‌గార్డ్ కమాండెంట్ అభిషేక్ చక్రవర్తి తెలిపారు. ఈ కార్యక్రమంలో సైంటిస్టులు నాగరాజుకుమార్, పద్మనాభం, జిల్లా ఎన్‌ఎస్‌ఎస్ కో-ఆర్డినేటర్ డాక్టర్ ఉదయ్‌శంకర్, రాష్ట్ర కార్యదర్శి వేణుగోపాల్‌నాయుడు, మత్స్యకార సంరక్షణ సమితి అధ్యక్షుడు పోలయ్య, మత్స్య కళాశాల డీన్ రామలింగయ్య తదితరులు పాల్గొన్నారు.