పచ్చదనంతోనే పర్యావరణ పరిరక్షణ

ABN , First Publish Date - 2022-10-04T04:12:01+05:30 IST

పచ్చదనంతోనే పర్యావరణ పరిరక్షణ సాధ్యమని మాజీ కౌన్సిలర్‌, సంయుక్త సేవా సంస్ధ ఉపాఽధ్యక్షుడు గంధం ప్రసన్నాంజనేయులు పేర్కొ

పచ్చదనంతోనే పర్యావరణ పరిరక్షణ
మొక్కలు నాటుతున్న గంధం ప్రసన్న తదితరులు

కావలిటౌన్‌, అక్టోబరు3: పచ్చదనంతోనే పర్యావరణ పరిరక్షణ సాధ్యమని మాజీ కౌన్సిలర్‌, సంయుక్త సేవా సంస్ధ ఉపాఽధ్యక్షుడు గంధం ప్రసన్నాంజనేయులు పేర్కొన్నారు. సోమవారం స్ధానిక వెంగళరావునగర్‌లోని సచివాలయం వద్ద మొక్కలు నాటారు. కార్యక్రమంలో సచివాలయ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ మల్లికార్జునరావు,రిటైర్డ్‌ హెచ్‌ఎం యం అజిత్‌బాబు, సంస్ధ అధ్యక్షుడు జీ సురేంద్ర తదితరులు పాల్గొన్నారు. 


Read more