పాఠశాలలను తనిఖీ చేసిన ఎంఈవో

ABN , First Publish Date - 2022-07-06T03:14:23+05:30 IST

మండలంలోని పెదపవనిలోని హిందూ ప్రాథమిక పాఠశాలను ఎంఈవో రవికుమార్‌ మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్బంగా

పాఠశాలలను తనిఖీ చేసిన ఎంఈవో
పెదపవనిలో నాడు-నేడు పనులపై హెచ్‌ఎంతో మాట్లాడుతున్న ఎంఈవో రవికుమార్‌

లింగసముద్రం, జూలై 5 : మండలంలోని పెదపవనిలోని హిందూ ప్రాథమిక పాఠశాలను ఎంఈవో రవికుమార్‌ మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్బంగా ఆయన ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు పట్టీలను, ఇతర రికార్డులను పరిశీలించారు. రెండవ విడత నాడునేడు పథకానికి ఈ పాఠశాల ఎంపికైనందున పనులను నాణ్యంగా చేయించాలన్నారు. అనంతరం స్థానిక హైస్కూల్‌లో జేవీకే కిట్లను అందజేశారు.అనంతరం ఆయన స్థానిక ఉర్దూ ప్రాథమికోన్నత పాఠశాలను తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు.ఈ కార్యక్రమంలో హెచ్‌ఎం మాధవరావు తదితరులు పాల్గొన్నారు.


Read more