పీఎం కిసాన్‌లో కోత తప్పదా ?

ABN , First Publish Date - 2022-09-18T03:30:22+05:30 IST

పీఎం కిసాన్‌ పథకం లబ్ధిదారుల సంఖ్యలో కోత పడే పరిస్థితి నెలకొంది. కేంద్ర ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయం కింద ఏడాదిలో మూ

పీఎం కిసాన్‌లో కోత తప్పదా ?

 జిల్లాలో 77 శాతమే ఈకేవైసీ పూర్తి

గడువు పొడిగిస్తేనే ప్రయోజనం

పొదలకూరు, సెప్టెంబరు 17: పీఎం కిసాన్‌ పథకం లబ్ధిదారుల సంఖ్యలో కోత పడే పరిస్థితి నెలకొంది. కేంద్ర ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయం కింద ఏడాదిలో మూడుసార్లు రూ.2వేల చొప్పున అందజేస్తున్న విషయం తెలిసిందే. పథకం ప్రారంభమయ్యాక ఇప్పటికీ 11 సార్లు రైతుల ఖాతాలకు నిధులు జమ చేశారు. 12వ విడత త్వరలో అందించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ తరుణంలో లబ్ధిదారుల్లో అనర్హులను గుర్తించేందుకు ఈకేవైసీ నమోదు చేయాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. సెల్‌ఫోన్‌కి ఓటీపీ వచ్చాక నిర్ధారించుకుని వేలిముద్ర తీసుకుంటారు. ఆ విధంగా జాబితాను నవీకరించాలని నిర్ణయించారు. నెలరోజులుగా ఈ ప్రక్రియ కొనసాగుతోంది. తొలుత ఈనెల 7వతేదీ వరకు గడువు విధించినప్పటికీ తాజాగా ఆదివారం వరకు పొడిగించారు. ఆర్‌బీకేల నుంచి వీఏవోలు ఫోన్‌లు చేసి ఈకేవైసీ చేసుకోవాలని సూచిస్తున్నారు. 



 77 శాతమే పూర్తి


ఈకేవైసీ నమోదు శనివారం నాటికి 77శాతమే పూర్తయింది. జిల్లాలో 1,93,099 మంది (77శాతం) లబ్ధిదారులు మాత్రమే ఈకేవైసీ చేయించుకున్నారు. మరో 44768 (23శాతం) మంది ముందుకు రావాల్సి ఉంది. ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం రైతులకు జమ చేస్తున్న రైతు భరోసా పథకం గురించి కూడా ప్రత్యేకంగా ఈకేవైసీ నమోదు ప్రారంభించారు. ఈ క్రాప్‌ ప్రక్రియతో పాటే ఇదీ కొనసాగుతోంది. 


----------

Updated Date - 2022-09-18T03:30:22+05:30 IST