పిడుగుపాటుకు యువకుడి మృతి

ABN , First Publish Date - 2022-08-26T05:06:07+05:30 IST

మండలంలోని తిక్కవరప్పాడు గ్రామంలో గురువారం సాయంత్రం పిడుగుపాటుకు ఓ యువకుడు మృతి చెందాడు.

పిడుగుపాటుకు యువకుడి మృతి

వెంకటాచలం, ఆగస్టు 25 : మండలంలోని తిక్కవరప్పాడు గ్రామంలో గురువారం సాయంత్రం పిడుగుపాటుకు ఓ యువకుడు మృతి చెందాడు. పోలీసుల కథనం మేరకు వివరాలు తిక్కవరప్పాడు పంచాయతీ గొట్లపాలెం గ్రామానికి చెందిన పచ్చబొట్ల నారాయణ కుమారుడు పవన్‌ (18) గేదెలు మేపుతుండగా పిడుగుపాటుకు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Read more