విద్యుద్ఘాతంతో ఒకరి మృతి

ABN , First Publish Date - 2022-10-12T04:51:39+05:30 IST

రొయ్యల చెరువులో ఏరియేటర్లు బిగిస్తుండగా విద్యుదాఘాతంతో ఒక వ్యక్తి మృతి చెందిన సంఘటన మండలంలోని పొట్టెంపాడులో మంగళవారం జరిగింది.

విద్యుద్ఘాతంతో ఒకరి మృతి

ముత్తుకూరు, అక్టోబరు 11 : రొయ్యల చెరువులో ఏరియేటర్లు బిగిస్తుండగా విద్యుదాఘాతంతో ఒక వ్యక్తి మృతి చెందిన సంఘటన మండలంలోని పొట్టెంపాడులో మంగళవారం జరిగింది.  పోలీసుల కథనం మేరకు ముత్తుకూరు ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీకి చెందిన పాకం వెంకటశేషయ్య (36) పాకం మస్తాన్‌తో కలిసి పొట్టెంపాడులోని రొయ్యల చెరువులో బ్లీచింగ్‌ చల్లేందుకు వెళ్లారు. అనంతరం ఏరియేటర్లు బిగిస్తుండగా విద్యుదాఘాతంతో వెంకటశేషయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. ముత్తుకూరు ఎస్‌ఐ శివకృష్ణారెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

Read more