శాప్‌ బ్యాడ్మింటన్‌ విజేతలకు సత్కారం

ABN , First Publish Date - 2022-07-08T03:48:44+05:30 IST

విజయవాడలో ఇటీవల జరిగిన రాష్ట్రస్థాయి శాప్‌ బ్యాడ్మింటన్‌ లీగ్‌ పోటీల్లో విజేతలుగా నిలిచిన జిల్లా అండర్‌-11 బ్యాడ్మింటన్‌ క్రీడాకారులను ఏపీ బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు, నుడా చైర్మన్‌ ముక్కాల ద్వారకనాథ్‌ అభినందించారు.

శాప్‌ బ్యాడ్మింటన్‌ విజేతలకు సత్కారం
క్రీడాకారులను అభినందిస్తున్న ద్వారకనాధ్‌

నెల్లూరు (విద్య), జూలై 7: విజయవాడలో ఇటీవల జరిగిన రాష్ట్రస్థాయి శాప్‌ బ్యాడ్మింటన్‌ లీగ్‌ పోటీల్లో విజేతలుగా నిలిచిన జిల్లా అండర్‌-11 బ్యాడ్మింటన్‌ క్రీడాకారులను ఏపీ బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు, నుడా చైర్మన్‌ ముక్కాల ద్వారకనాథ్‌ అభినందించారు. గురువారం నగరంలోని నుడా కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ముక్కాల మాట్లాడుతూ జిల్లా క్రీడాకారులు రాష్ట్ర, జాతీయస్థాయిలో పతకాలు సాధిస్తూ జిల్లా కీర్తిని ఇనుమడింపచేయడం అభినందనీయమన్నారు. అనంతరం విజేతలైన మహీధర్‌, వర్షిత్‌, పెంచల్‌హిమంశు, భరత్‌లను సత్కరించి నగదు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో కోచ్‌ వెంకటేష్‌ పాల్గొన్నారు. 

బధిర క్రికెట్‌ క్రీడాకారులకు చేయూత

ఒంగోలులో ఈనెల 8వతేదీ నుంచి జరిగే జోనల్‌స్థాయి బధిర క్రికెట్‌ క్రీడాకారులకు నుడా చైర్మన్‌ ముక్కాల ద్వారకనాఽథ్‌ దుస్తులు పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ వినికిడి లోపాన్ని జయించి క్రీడల్లో సత్తాచాటుతూ అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎ్‌సఎఫ్‌ కార్యదర్శి వెంకటేశ్వర్లు, జిల్లా బధిర క్రీడా ఫెడరేషన్‌ అధ్యక్షుడు వి.కుమార్‌, కార్యదర్శి పి.మల్లేశ్వరరావు, క్రీడాకారులు పాల్గొన్నారు. 

Read more