అహంకారంతో ఎన్టీఆర్‌ పేరు తొలగింపు

ABN , First Publish Date - 2022-09-30T04:52:58+05:30 IST

ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి అహంకారంతో ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీకి ఎన్టీఆర్‌ పేరు తొలగించారని మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి అన్నారు.

అహంకారంతో ఎన్టీఆర్‌ పేరు తొలగింపు
మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి

 కోవూరు, సెప్టెంబరు 29 : ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి అహంకారంతో ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీకి ఎన్టీఆర్‌ పేరు తొలగించారని మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి అన్నారు. స్థానిక ఎన్జీవో భవనంలో టీడీపీ నాయకులు గురువారం చేపట్టిన రిలే నిరాహార దీక్షాశిబిరాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఎన్టీఆర్‌ పేరును తొలగించి ముఖ్య మంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి, వైసీపీ నాయకులు టీడీపీపై కక్ష తీర్చుకున్నామని సంబరపడి పోతు న్నారన్నారు. తిరిగి హెల్త్‌ యూనివర్సిటీకి ఎన్టీఆర్‌ పేరు పెట్టే వరకు ఆందోళన విరమించే ప్రసక్తేలేదన్నారు. పోలంరెడ్డి వెంట టీడీపీ నాయకులు మందా రవికుమార్‌, మాతూరు శ్రీనివాసులురెడ్డి, సత్యవోలు సత్యంరెడ్డి, చెముకుల కృష్ణచైతన్య తదితరులు ఉన్నారు. రిలే నిరాహార దీక్షలో టీడీపీ నాయకులు ఇంతా మల్లారెడ్డి, జెట్టి రాజగోపాలరెడ్డి, కొల్లారెడ్డి సుధాకరరెడ్డి, నల్లపనేని చౌదరి, పాలపర్తి శ్యామ్‌, బాల రవి, నాటకరాని వెంకట్‌, సూరిశెట్టి శ్రీనివాసులు, యద్దలపూడి నాగరాజు, బెల్లంకొండ విజయకుమార్‌ తదితరులు కూర్చొన్నారు.

Read more