ఎన్‌ఎంఎంఎస్‌ మెరిట్‌ జాబితా విడుదల

ABN , First Publish Date - 2022-07-06T04:30:09+05:30 IST

2021-22 విద్యా సంవత్సరానికి సంబంధించి మార్చిలో జరిగిన జాతీయ ఉపకారవేతన పరీక్ష (ఎన్‌ఎంఎంఎస్‌) ఫలితాలతో పాటు కేటగిరి వారీగా తుది మెరిట్‌ జాబితా విడుదల చేసినట్లు జిల్లా పరీక్షల విభాగం అసిస్టెంట్‌ కమిషనర్‌ పి.రామారావు ఒక ప్రకటనలో తెలిపారు.

ఎన్‌ఎంఎంఎస్‌ మెరిట్‌ జాబితా విడుదల

నెల్లూరు (విద్య) జూలై 5 : 2021-22 విద్యా సంవత్సరానికి సంబంధించి మార్చిలో జరిగిన జాతీయ ఉపకారవేతన పరీక్ష (ఎన్‌ఎంఎంఎస్‌) ఫలితాలతో పాటు కేటగిరి వారీగా తుది మెరిట్‌ జాబితా విడుదల చేసినట్లు జిల్లా పరీక్షల విభాగం అసిస్టెంట్‌ కమిషనర్‌ పి.రామారావు ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికైన విద్యార్థుల జాబితాను ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్‌ బీఎస్‌ఈఏపీ డాట్‌ జీవోవీ డాట్‌ ఇన్‌, జిల్లా విద్యాశాఖ వెబ్‌సైట్‌ డీఈవో నెల్లూరు డాట్‌ 50వెబ్స్‌ డాట్‌ కామ్‌లో పొందుపరిచామని పేర్కొన్నారు. విద్యార్థులు తమ పూర్తి వివరాలను నేషనల్‌ స్కాలర్‌షిప్‌ పోర్టల్‌లో నమోదు చేయాలని తెలిపారు. పూర్తి వివరాలకు దర్గామిట్ట సెయింట్‌జోసఫ్‌ పాఠశాలలో ఉన్న జిల్లా పరీక్షల విభాగంలో సంప్రదించాలని సూచించారు. 

Read more