నెల్లూరు అభివృద్ధికి నిధులు ఎంత ఖర్చు చేశారు!?

ABN , First Publish Date - 2022-09-24T05:30:00+05:30 IST

నెల్లూరు అభివృద్ధికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహనరెడ్డి ఎంత నిధులు కేటాయించారో చెప్పాలని, జిల్లాలో జరుగుతున్న అభివృద్ది కార్యక్రమాలు, అనేక సంక్షేమ పథకాలు కేంద్రప్రభుత్వ నిఽధులతోనే సాగుతున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు తెలిపారు.

నెల్లూరు అభివృద్ధికి  నిధులు ఎంత ఖర్చు చేశారు!?
సీ్ట్రట్‌ కార్నర్‌లో మాట్లాడుతున్న సోము వీర్రాజు

కేంద్రం నిధులతోనే సంక్షేమ పథకాల అమలు

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు


నెల్లూరు (స్టోనహౌస్‌పేట), సెప్టెంబరు 24 : నెల్లూరు అభివృద్ధికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహనరెడ్డి ఎంత నిధులు కేటాయించారో చెప్పాలని, జిల్లాలో జరుగుతున్న అభివృద్ది కార్యక్రమాలు, అనేక సంక్షేమ పథకాలు కేంద్రప్రభుత్వ నిఽధులతోనే సాగుతున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు తెలిపారు. నెల్లూరులోని మూలాపేట, హరనాధపురం సెంటర్లలో శనివారం స్ర్టీట్‌ కార్నర్‌, ప్రజాపోరుబాట కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా  సోమువీర్రాజు మాట్లాడుతూ ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో చేపట్టిన రాక్షస పాలనను ప్రజలకు వివరించేందుకే స్ర్టీట్‌ కార్నర్‌ కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పథకాలకు పేర్లు మార్చుకొని, కేంద్రం నుంచి వస్తున్న నిధులతో రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలను చేపడుతున్నారని విమర్శించారు. దోచుకోవడం, అవినీతే లక్ష్యంగా ఈ రాష్ట్రంలో పాలన సాగుతోందని దుయ్యబట్టారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు బీజేపీని గెలిపిస్తే రాష్ట్రం రూపురేఖలే మారిపోతాయని, ఇందుకు ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. ఆయన వెంట బీజేపీ జిల్లా అధ్యక్షుడు భరతకుమార్‌ యాదవ్‌, కిసాన మోర్చా జాతీయ కార్యదర్శి సన్నపురెడ్డి సురేష్‌రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు పి సరేంద్రరెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిఽధి కర్నాటి ఆంజనేయరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Read more