-
-
Home » Andhra Pradesh » Nellore » nellornu nera rajadaniga marcrru-MRGS-AndhraPradesh
-
నెల్లూరును నేర రాజధానిగా మార్చేశారు : సోమిరెడ్డి
ABN , First Publish Date - 2022-09-11T04:15:12+05:30 IST
ప్రశాంతంగా ఉన్న నెల్లూరుజిల్లాను నేర రాజధానిగా మార్చేశారని టీడీపీ జాతీయ పొలిట్‌బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహ

పొదలకూరు, సెప్టెంబరు 10: ప్రశాంతంగా ఉన్న నెల్లూరుజిల్లాను నేర రాజధానిగా మార్చేశారని టీడీపీ జాతీయ పొలిట్‌బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. శనివారం మండలంలోని మహమ్మదాపురం గిరిజనకాలనీలో బాదుడే బాదుడు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ముందుగా ఇటీవల మరణించిన నల్లపరెడ్డి జయనేంద్రారెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం ఇంటింటికి కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజనకాలనీ అభివృద్ధికి ఆమడ దూరంలో ఉందన్నారు. ఇప్పటికే వైసీపీ నాయకుల ప్రోద్భలంతో పొదలకూరు ఎస్‌ఐ నలుగురు ప్రాణాలను పొట్టన పెట్టుకున్నారన్నారు. వారి కుటుంబ సభ్యుల గోష్ఠ ఆయనకు తప్పకుండా తగులుతుందన్నారు. వైసీపీ అరాచకాలకు భయపడి టీడీపీ కార్యకర్తలు, సామాన్యులు ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో నాయకులు సుధాకర్‌రెడ్డి, దయాకర్‌రెడ్డి, రషీద్ అహ్మద్, పీ రవి, ఏ.శివారెడ్డి, జనార్దన్‌రెడ్డి, శ్రీనివాసులు, శంకరయ్య, మధు తదితరులు పాల్గొన్నారు.