Barashahid Dargah: రొట్టెల పండుగలో తగ్గిన భక్తుల రద్దీ

ABN , First Publish Date - 2022-08-10T13:43:18+05:30 IST

జిల్లాలోని బారాషహీద్ దర్గా వద్ద రెండవ రోజు రొట్టెల పండుగను ఘనంగా నిర్వహిస్తున్నారు.

Barashahid Dargah: రొట్టెల పండుగలో తగ్గిన భక్తుల రద్దీ

నెల్లూరు: జిల్లాలోని బారాషహీద్ దర్గా (Barashahid Dargah) వద్ద రెండవ రోజు రొట్టెల పండుగ (Rottela festival)ను ఘనంగా నిర్వహిస్తున్నారు. అయితే గతంతో పోలిస్తే రొట్టెల పండుగకు వచ్చే భక్తుల (Devotees) రద్దీ తగ్గింది. ఈరోజు రాత్రికి గంధమహోత్సవం నిర్వహించనున్నారు. టీడీపీ హయాంలో నిర్మించిన భక్తుల వసతి గృహాన్ని ఓ వైసీపీ నేత టెంకాయల దుకాణంగా మార్చేశాడు. అటు స్వర్ణాల చెరువులో నీటిని శుభ్రం చేయకపోవడంతో దుర్వాసన వస్తోంది. రొట్టెలు మార్చుకునెందుకు  భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దర్గాకి కిలో మీటర్ల దూరంలోనే వాహనాలు నిలిపివేశారు. గతంలో ఎన్నడూ లేనంతగా పోలీసు ఆంక్షలు విధించారు. 

Read more