సహకార సంఘాల్లో బంగారంపై రుణాలు

ABN , First Publish Date - 2022-07-08T03:58:05+05:30 IST

జిల్లాలోని 13 సహకార సంఘాల్లో బంగారు ఆభరణాలపై రుణాలు ఇచ్చేందుకు అవకాశం కల్పించామని నెల్లూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్‌ కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి తెలిపారు.

సహకార సంఘాల్లో బంగారంపై రుణాలు
మాట్లాడుతున్న సత్యనారాయణరెడ్డి

ఎన్‌డీసీసీబీ చైర్మన్‌ కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి

నెల్లూరు (హరనాథఫురం), జూలై 7 : జిల్లాలోని 13 సహకార సంఘాల్లో బంగారు ఆభరణాలపై రుణాలు ఇచ్చేందుకు అవకాశం కల్పించామని నెల్లూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్‌ కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి తెలిపారు. గురువారం ఎన్‌డీసీసీబీ సమావేశ మందిరంలో సహకార సంఘాలపై నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ నాబార్డు సహకారంతో పీఏసీఎస్‌-ఎంఎస్‌సీ పథకం కింద ఐదు సహకార సంఘాలకు 4 శాతం వడ్డీతో రుణాలు ఇచ్చామన్నారు. గోదాముల నిర్మాణాలకు రుణాలు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. రైతులకు పంట రుణాలు, ఎల్‌టీ రుణాలు ఇస్తున్నామన్నారు. ఈ సమావేశంలో ఎన్‌డీసీసీబీ సీఈవో డాక్టర్‌ చల్లా శంకర్‌బాబు, జీఎం సరిత, ఆప్కాబ్‌ సీజీఎం రాజయ్య, ఆప్కాబ్‌ అధికారులు, బ్యాంకు అధికారులు, సంఘాల అధ్యక్షులు, సీఈవోలు పాల్గొన్నారు.

Read more