ముస్లిం శ్మశాన వాటికలు అభివృద్ధి చేయండి

ABN , First Publish Date - 2022-09-22T03:25:19+05:30 IST

గ్రామాల్లో ముస్లిం శ్మశాన వాటికలు అభివృద్ధి చేయాలని ఆవాజ్‌ జిల్లా కార్యదర్శి రషీద్‌ బుఽధవారం ఎంపీడీవోకి వినతిపత్రం అందజేశా

ముస్లిం శ్మశాన వాటికలు అభివృద్ధి చేయండి
ఎంపీడీవోకి వినతిపత్రం అందజేస్తున్న ఆవాజ్‌ నాయకులు

బుచ్చిరెడ్డిపాళెం,సెప్టెంబరు21: గ్రామాల్లో ముస్లిం శ్మశాన వాటికలు అభివృద్ధి చేయాలని ఆవాజ్‌ జిల్లా కార్యదర్శి రషీద్‌ బుఽధవారం ఎంపీడీవోకి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్మశాన వాటికలు, షాదీమంజిల్స్‌ ఆధునికీకరణకోసం గతంలో తాము చేపట్టిన కార్యక్రమానికి ఉన్నతాధికారులు స్పందించి ఇచ్చిన ఆదేశాల మేరకు మండల అధికారులు  ప్రతిపాదనలు సిద్ధం చేసి పనులు పూర్తయ్యేలా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆవాజ్‌ నాయకులు జానీభాషా, మునీర్‌ అహ్మద్‌, మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు.


Read more