మున్సిపల్‌ కార్మికుల సమ్మె నోటీసు

ABN , First Publish Date - 2022-01-29T04:49:25+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ నూతన పీఆర్సీని రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఏపీ మున్సిపల్‌ వర్క్‌ర్స్‌, ఎంప్లా యీస్‌ ఫెడరేషన్‌

మున్సిపల్‌ కార్మికుల సమ్మె నోటీసు

ఆత్మకూరు, జనవరి 28: రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ నూతన పీఆర్సీని రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఏపీ మున్సిపల్‌ వర్క్‌ర్స్‌, ఎంప్లా యీస్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర కమిటి పిలుపు మేరకు ఫిబ్రవరి 7 నుంచి ఆత్మకూరు మున్సిపాలిటీలో కూడా నిరవధిక సమ్మె చేయనున్నట్లు యూనియన్‌ నాయకులు జి నాగేంద్ర తెలిపారు. ఈ మేరకు శుక్రవా రం మున్సిపల్‌ కమీషనర్‌ ఎం రమేష్‌బాబుకు సమ్మె నోటీసును అందజేశారు. ముందుగా పలువురు కార్మికులు, నాయకులు మున్సిప ల్‌ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. మున్సిపల్‌ యూని యన్‌ నాయకులు రూబిన్‌, గురవయ్య, రమేష్‌, సీఐటీయూ నాయకు లు కొండమూరి హజరత్తయ్య తదితరులు పాల్గొన్నారు.

Read more