ముగిసిన టీడీపీ దీక్ష

ABN , First Publish Date - 2022-10-03T05:02:06+05:30 IST

హెల్త్‌ యూనివర్శిటీకి ఎన్టీఆర్‌ పేరును కొనసాగించాలని స్థానిక టీడీపీ కార్యాలయ ఆవరణలో గత మూడు రోజులుగా తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహారదీక్ష ఆదివారంతో ముగిసింది.

ముగిసిన టీడీపీ దీక్ష
గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తున్న టీడీపీ నాయకులు

 దుత్తలూరు, అక్టోబరు 2: హెల్త్‌ యూనివర్శిటీకి ఎన్టీఆర్‌ పేరును కొనసాగించాలని స్థానిక టీడీపీ కార్యాలయ ఆవరణలో గత మూడు రోజులుగా తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహారదీక్ష ఆదివారంతో ముగిసింది. హెల్త్‌ యూనివర్శిటీకి ఎన్టీఆర్‌ పేరును కొనసాగించే వరకు ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. అనంతరం గాంధీజీ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ, ఎంపీపీలు చీదర్ల మల్లికార్జున, రవీంద్రబాబు, నాయకులు చల్లా ప్రసాద్‌, సుబ్బారెడ్డి, జెమిని, కుంకు నారాయణ, మధు, వెంగళరావు తదితరులు పాల్గొన్నారు. 

Read more